వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనదారులకు నరకయాతనగా మారింది. నిజాంసాగర్ నుంచి బొగ్గుగుడిసె వరకు రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
వర్షపు నీటితో గుంతలు కనిపించక వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

