వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ నుంచి శివమొగ్గకు ప్రత్యేక రైలు ప్రతిపాదనకు రైల్వే అధికారులు సానుకూలత తెలిపారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించి, రైలు నడపడం సాధ్యమేనని నివేదిక ఇచ్చారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల భక్తులకు రైలు ఉపయోగకరంగా ఉంటుందని, సుమారు వెయ్యి మంది శృంగేరి పీఠాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలిపారు. తదుపరి ఆమోదానికి ప్రతిపాదనను పంపాలని సిఫారసు చేశారు.
Comments
Loading comments...

