Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడిలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల తనిఖీ

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 4:47 PM విజయనగరంGeneral
గరివిడిలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల తనిఖీ - Udayam
గరివిడి మండల వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల ప్రత్యేక తనిఖీలను గురువారం ఎస్సై బి. లోకేశ్వరరావు చేపట్టారు. బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, మోటార్ వెహికల్ (ఎంవీ) చట్టం, బస్సు బాడీ కోడ్లను పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులను సామర్థ్యానికి మించి ఎక్కించరాదని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

Comments

G
Loading comments...