వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ గుంటూరులో భాగంగా ఆటోనగర్ APIIC ప్రాంగణంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి. నజీనా బేగం పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రీన్ గుంటూరు ఉన్నతమైన కార్యక్రమన్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించుటమే కాకుండా వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.
Comments
Loading comments...

