Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో ఘనంగా నిత్య కళ్యాణం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 2:19 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో ఘనంగా నిత్య కళ్యాణం - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సోమవారం నిత్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సుదర్శన నరసింహ హోమం అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణం జరిపించారు. విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...