వార్తలకు తిరిగి వెళ్లండి

పాపన్నపేట మండలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మురళీకృష్ణ ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. నాగ్సాన్‌పల్లి మందిరంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలు చాటుతున్నారు.
Comments
Loading comments...

