Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో వైభవంగా గరుడసేవ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 11:36 AM తిరుపతిGeneral
తిరుమలలో వైభవంగా గరుడసేవ - Udayam
గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో బుధవారం రాత్రి గరుడసేవ వైభవంగా జరిగింది. విశేష పుష్ప, ఆభరణాల అలంకరణలో మలయప్పస్వామి గరుడవాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, గోవింద నామస్మరణల మధ్య వాహనసేవ భక్తిశ్రద్ధలతో సాగింది. గురుపౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గరుడసేవను వీక్షించారు.

Comments

G
Loading comments...