వార్తలకు తిరిగి వెళ్లండి

చించోలి లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గంగమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు తలపై తెప్పలతో మంజీరా నది వరకు నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని కోరుతూ నదిలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీనివాస్, ఉప సర్పంచి శేఖర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగప్ప, మాజీ సర్పంచి అంబయ్యతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పండుగ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
Comments
Loading comments...

