Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:03 AM నిర్మల్ General
బాసరలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని అర్చకుడు భూమన్న యాదవ్‌ స్వామివారికి పాలు, పెరుగు, వెన్న, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...