Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాడంపల్లిలో వైభవంగా బోనాలు

Follow Udayam on Google
Ritu Jun 11, 2026 12:25 PM జగిత్యాలGeneral
మ్యాడంపల్లిలో వైభవంగా బోనాలు - Udayam
జగిత్యాల జిల్లా మ్యాడంపల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామదేవతలైన పోచమ్మ, పెద్దమ్మ తల్లులకు బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. గ్రామాన్ని చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని దేవతలను వేడుకున్నారు. ఈ వేడుకల్లో ముదిరాజ్ సంఘ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...