వార్తలకు తిరిగి వెళ్లండి

పల్లెపండుగ 3.0, వీబీజీ రాంజీ నిధులతో రూ.16.2 కోట్లతో సిమెంట్ రహదారులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తెలిపారు. మూలపాడు, జూపూడి, గుంటుపల్లిలో రూ.47 లక్షలు, రూ.30 లక్షలు, రూ.48 లక్షలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జ్ గాంధీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

