Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో బిజెపి బలోపేతమే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Sep 08, 2026 11:17 AM శ్రీకాకుళంGeneral
గ్రామాలలో బిజెపి బలోపేతమే లక్ష్యం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పలాస నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, సీనియర్ న్యాయవాది ఎర్రగుంట్ల కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం మందసలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పింఛన్లకు అర్హులైన పేదలను గుర్తించి దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...