వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో బడులు తెరిచి నెలరోజులవుతున్నా విద్యార్థి మిత్ర కిట్లు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందక ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో చతికిలబడుతున్నాయి. తాగునీటి యంత్రాలు మూలనపడటంతో పిల్లలు చేతిపంపు నీళ్లే తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం సరిగా లేక సొంతంగా బాక్సులు తెచ్చుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్లలోనే విద్యార్థుల సంఖ్య 43 లక్షల నుంచి 30 లక్షలకు పడిపోయింది. నాడు-నేడు కింద నిర్మించిన గదులు రంగులు వెలిసిపోయి, సంరక్షణ కరువైందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

