వార్తలకు తిరిగి వెళ్లండి
20 ఏళ్ల తర్వాత ప్రారంభమైన ప్రభుత్వ బడి

ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ కాలనీలో రెండు దశాబ్దాలుగా మూతపడి ఉన్న ప్రభుత్వ పాఠశాల మళ్లీ తెరుచుకుంది. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ ప్రతినిధులతో కలిసి పాఠశాలను ప్రారంభించి, విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు.
ఈ బడిని తిరిగి తెరిపించేందుకు కృషి చేసిన విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు.
Comments
Loading comments...