Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం.. కేసు నమోదు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 11:35 AM కర్నూలుGeneral
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం.. కేసు నమోదు - Udayam
కర్నూలు అర్బన్ మండలం జోహరాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ జి. మారుతీ శంకర్ తెలిపారు. తహశీల్దార్ డి. రవికుమార్ ఫిర్యాదు మేరకు సర్వే నంబర్ 174లోని 2.53 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిలో అనుమతులు లేకుండా జేసీబీతో పునాదులు తవ్వి షెడ్డు నిర్మాణానికి యత్నించినట్లు గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...