వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, వాట్సాప్ డీపీలు మార్చి నిరసన తెలిపారు. 5 డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు.
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు చేపట్టి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

