వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలంలోని పాత షుగర్ ఫ్యాక్టరీ - గొల్లపల్లి రోడ్డు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు కురవడంతో గోతులలో వరదనీరు చేరడం వలన చెరువులను తలపిస్తున్నాయి. బొబ్బిలి గ్రోత్సెంటర్ పరిశ్రమలకు కారాడ, గొల్లపల్లి, అలజంగి, పిరిడి, అప్పయ్యపేట, తదితర గ్రామాల నుంచి వచ్చే కార్మికులు ఇదే మార్గంలో రాకపోకలు చేస్తారు.
Comments
Loading comments...

