వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల మండలంలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటుందని టీడీపీ నాయకుడు నిమ్మల శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గోరంట్లలో మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని అన్నారు.
2029 ఎన్నికలే లక్ష్యంగా మంత్రి సవితను మరోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తామని శ్రీధర్ తెలిపారు.
Comments
Loading comments...

