Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంటాల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

Follow Udayam on Google
babu varun Sep 07, 2026 6:17 PM రాజన్న సిరిసిల్లGeneral
గోరంటాల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం - Udayam
గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో స్థానిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను సర్పంచ్ లతికా, అంజిరెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ అంజయ్య, వార్డ్ మెంబర్స్ రాజు, రవీందర్, శ్రీను, ఉపాధ్యాయులు మనోహరరెడ్డి, భవానీ, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...