Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో భారీ పండుగప్ప చేప

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:00 AM కాకినాడGeneral
గోదావరిలో భారీ పండుగప్ప చేప - Udayam
కాకినాడ జిల్లాలో గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 23 కేజీల భారీ పండుగప్ప చిక్కింది. యానాం మార్కెట్‌కు తరలించిన ఈ అరుదైన చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం నిర్వహించిన వేలంలో కోలాటి దేవి అనే వ్యాపారి ఈ భారీ చేపను రూ.16 వేలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫొటోలు, విశేషాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...