Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరుగుదొడ్డే గూడుగా

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 25, 2026 2:45 PM వరంగల్General
మరుగుదొడ్డే గూడుగా - Udayam
ఖానాపురం మండలం మనుబోతులగడ్డకు చెందిన భూవమ్మ భర్త మరణం తర్వాత ఒంటరిగా ఉంటోంది. నాలుగేళ్ల క్రితం గుడిసె కూలిపోవడంతో నిరాశ్రయురాలై, ప్రభుత్వ పథకంలో నిర్మించిన మరుగుదొడ్డిలోనే తలదాచుకుంటోంది. అక్కడే వంట సామగ్రి పెట్టుకుంటూ, వర్షం వస్తే ఇరుగుపొరుగు వారి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. గర్భిణైన కూతురు కూడా రావడంతో ఇబ్బంది పడుతున్నానని, అధికారులు స్పందించి తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె వేడుకుంటోంది.

Comments

G
Loading comments...