వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు గుడ్ న్యూస్

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. బకాయిల చెల్లింపులపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది కొత్త అడ్మిషన్లతో పాటు 2, 3, 4 సంవత్సరాల విద్యార్థుల ఫీజులను కూడా విడుదల చేస్తామని కోర్టుకు వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మొత్తం రూ.1000 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం నివేదించింది.
Comments
Loading comments...