Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మన్ననూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 09, 2026 2:54 PM నాగర్ కర్నూల్General
మన్ననూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ - Udayam
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం తిన్న 26 మందికి పైగా విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం తిన్న కిచిడి వికటించడమే దీనికి కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పాఠశాల నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై, బాధితులను చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు అక్కడ చికిత్స అందుతోంది.

Comments

G
Loading comments...