వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని గొట్టిపర్తి గ్రామంలో దంపతులు దారుణంగా మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన గొడవలో కోట సత్యనారాయణ (68) తన భార్య కోట కనకలక్ష్మిని (60) ఇనుపరాడుతో కొట్టి చంపాడు. అనంతరం సత్యనారాయణ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

