Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కార్ దవాఖానాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 09, 2026 2:38 PM హైదరాబాద్General
సర్కార్ దవాఖానాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు - Udayam
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే వైద్యం బాగుంటుందనేది అపోహ మాత్రమేనని, ప్రభుత్వ దవాఖానాల్లోనూ నాణ్యమైన చికిత్స అందుతోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, గత బకాయిలను చెల్లించి స్థానికంగానే వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్స్ యాక్ట్ తెచ్చామని, మినిమం వేతనాలను కూడా పెంచినట్లు మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...