Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నాషా ముక్త్ భారత్ అభియాన్’

వైష్ణవి శర్మ Jul 09, 2026 9:06 AM హన్మకొండ 2 viewsabout 2 hours ago
‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ - Udayam Digital
తెలంగాణలో మాదకద్రవ్యాల నివారణ కోసం చేపట్టిన ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి అండ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించిన ఈ ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...