Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా అథ్లెటిక్స్‌లో ప్రవళికకు స్వర్ణం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 13, 2026 8:55 AM జాతీయంక్రీడలు
ఆసియా అథ్లెటిక్స్‌లో ప్రవళికకు స్వర్ణం - Udayam
నల్గొండ జిల్లా డిండి గురుకుల స్పోర్ట్స్‌ అకాడమీకి చెందిన తాపీ మేస్త్రీ కూతురు నారిమళ్ల ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. చైనాలో జరిగిన ఆసియా అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పరుగులో ఆమె బంగారు పతకం సాధించారు. ఈ ఘనత సాధించిన ప్రవళికను, ఆమె కోచ్‌ పరుశురాములును మరియు అకాడమీ యాజమాన్యాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...