వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం ఉదయానికి ఆచంట, పెనుగొండ మండలాల్లోని పుష్కర ఘాట్లు నీటమునిగాయి.
వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద తగ్గే వరకు నది పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

