వార్తలకు తిరిగి వెళ్లండి
పోలవరంపై చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబట్టే ప్రాజెక్టు ఆలస్యమైందని, లేదంటే 2021లోనే పూర్తయ్యేదని సీఎం విమర్శించారు. ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...