Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
K Anuradha Sep 02, 2026 3:56 PM శ్రీకాకుళంGeneral
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - Udayam
ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు ఓ బాలుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం పట్టణ ఎస్‌ఐ ఎం. ముకుందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు నమోదు చేసినట్లు సీఐ ఎం. చిన్నానాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...