వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న మీసాల సాయి సుమంత్ (27)పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఎస్పీ దామోదర్ ఆదివారం తెలిపారు. అతడిపై విజయనగరం రూరల్, వన్డేన్, బొండపల్లి పోలీస్ స్టేషన్లలో ఐదు గంజాయి కేసులు ఉన్నాయని చెప్పారు.
పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకుని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
Comments
Loading comments...

