వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్ఛాపురం పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై ముకుందరావు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి 12.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నమనాయుడు తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కూ తరలించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

