వార్తలకు తిరిగి వెళ్లండి

రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జిపై మంగళవారం రెండు లారీలు మట్టిలో కూరుకుపోయాయి. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, దానికి అనుసంధానంగా సరైన రోడ్డు నిర్మించకపోవడంతో వర్షాలకు మట్టి బురదగా మారి వాహనాలు దిగబడుతున్నాయి. అధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

