వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం గంగాపూర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. యూట్యూబర్లు రితిక, హారిక స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి ప్రసాదం పంచుకున్నారు. సర్పంచ్ రాయిల్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ గుర్రపు తిరుపతి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

