వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గ్రామస్తులు గండికోట మైసమ్మ బోనాలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జోగురమణ సత్యనారాయణ గండికోట మైసమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలను కాపాడాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య, వార్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

