వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో 14 ఏళ్ల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమెకు స్థానిక ఆర్‌ఎంపీ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత స్పృహతప్పి, నోటి నుంచి నురగ వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
Comments
Loading comments...

