Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిడుగు రామ్మూర్తి పంతులు సేవలు చిరస్మరణీయం - ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
devendra Aug 29, 2026 11:44 AM తూర్పుగోదావరిGeneral
గిడుగు రామ్మూర్తి పంతులు సేవలు చిరస్మరణీయం - ఎమ్మెల్యే నల్లమిల్లి - Udayam
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో శనివారం గిడుగు చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలుగు భాషను ప్రజల వాడుక భాషగా తీర్చిదిద్దేందుకు గిడుగు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Comments

G
Loading comments...