Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సీఎస్‌ఐ 80వ ఆవిర్భావ మహోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Sandeep Sep 27, 2026 5:02 PM నిర్మల్General
ఘనంగా సీఎస్‌ఐ 80వ ఆవిర్భావ మహోత్సవ వేడుకలు - Udayam
సోన్ మండల కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిలో 80వ ఆవిర్భావ మహోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, సోన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోహినొద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణలో మొక్కలు నాటారు. క్రైస్తవ సంఘస్తులు గీతాలాపనలు, ఆరాధన కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...