Back to feed
నూతన సీడీఎస్‌గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకరణ
Rohit Singh May 31, 2026 6:00 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago

భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. చైనా, పాకిస్థాన్ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన.. ఇకపై త్రివిధ దళాల ఏకీకృత కమాండ్స్ (మిలిటరీ థియేటరైజేషన్) ఏర్పాటును పర్యవేక్షించనున్నారు.
దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు సాయుధ బలగాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...


