వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలు, ఉన్నత చదువుల దరఖాస్తుల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల నుండి గెజిటెడ్ సంతకాల పేరిట కొందరు అధికారులు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉచితంగా ధ్రువీకరించడం గెజిటెడ్ అధికారుల కనీస బాధ్యత. దీనికోసం డబ్బులు ఆశించడం తీవ్రమైన నేరం.
సర్టిఫికెట్ల ధ్రువీకరణకు లంచం డిమాండ్ చేయడం అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన చర్య. నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునే ఇలాంటి అక్రమార్కులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. యువత కూడా చట్టాలపై అవగాహన పెంచుకుని చైతన్యవంతులు కావాలి.
Comments
Loading comments...

