వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని గాజులరామారంలో గల ఒక అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఫ్లాట్‌లో గీజర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా గీజర్ సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

