వార్తలకు తిరిగి వెళ్లండి
ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ డెలివరీ

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఇకపై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థతో స్విగ్గీ కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది.
ఈ సరికొత్త భాగస్వామ్యం ద్వారా హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కిలోల ప్రత్యేక కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్ ‘హెచ్‌పీ నవ్య’ వినియోగదారులకు ఇన్‌స్టామార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.
Comments
Loading comments...