Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన రుద్రేశ్వరి అమ్మవారు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:27 PM హన్మకొండ General
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన రుద్రేశ్వరి అమ్మవారు - Udayam
వేయిస్తంభాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం రుద్రేశ్వరి అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు, గాయత్రీ మంత్ర పారాయణం నిర్వహించి, సింహవాహనంపై అమ్మవారి వాహనసేవ చేపట్టారు. భరత్ శర్మ ఆధ్వర్యంలో మహా చండీయాగం నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.

Comments

G
Loading comments...