వార్తలకు తిరిగి వెళ్లండి

గార్ల–బయ్యారం సీఐ ఆధ్వర్యంలో సీతంపేట గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు.
మహబూబాబాద్ ఎస్పీ శబరీశ్ ఆదేశాలతో గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

