వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గార్ల పోలీస్‌స్టేషన్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఎస్సై సాయికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సెప్టెంబరు 17 ప్రాధాన్యాన్ని వివరించారు.
ప్రజలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శాంతిభద్రతల పరిరక్షణే తమ లక్ష్యమని ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటరెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

