వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలం గాగిల్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు పిట్టల శ్రీలత–శ్రీనివాస్ ఇంటి నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ ఎర్రల జానకిరాజు శంకుస్థాపన చేశారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ తరఫున సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

