Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17న తెలంగాణ కేబినెట్ భేటీ

విక్రాంత్ రెడ్డి Jul 13, 2026 2:50 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
17న తెలంగాణ కేబినెట్ భేటీ - Udayam Digital
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల వంటి పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపు ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్థిక శాఖ కొర్రీలతో పెండింగ్‌లో పడిన నీటిపారుదల శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సీఎంను కలిసి ఈ అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...