వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవపురంలో గత 13 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఆగ్రహించిన యువకులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ఖాళీ బకెట్లతో పడుకుని రాస్తారోకో చేపట్టారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తాగునీరు లేక నరకం చూస్తున్నామని, సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

