వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ ప్రియాంక మోల్ బంధువులతో కలిసి వికారాబాద్ అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. వ్యూ పాయింట్ వద్ద ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.
వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సరదాగా గడిపేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

