వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్‌ను లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు క్యాబిన్ లోనే సజీవదహనమయ్యారు. పేపర్ లోడ్‌తో వెళ్తున్న లారీ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు తీవ్రంగా చెలరేగాయి.
"అన్నా కాపాడండి.. నాకు పిల్లలున్నారు" అంటూ ప్రమాద సమయంలో డ్రైవర్ చేసిన ఆర్తనాదాలు స్థానికులను తీవ్రంగా కలచివేసాయి. వారు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, మంటలు పెద్దవిగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది.
Comments
Loading comments...

